Shani Gochar 2023: వేద గ్రంధాల ప్రకారం అనేక విషయాలు భవిష్యత్తు తరాల కోసం దాచి ఉంచాయారు. ఇక ముఖ్యంగా జ్యోతిష్యం కూడా అలానే అనేక గ్రంధాల్లో నిక్షిప్తం చేశారు. ప్రతి గ్రహం, రాశి ఒక నిర్దిష్ట సమయం వరకు రాశిచ క్రంలో ఉండి, ఆ రాశిని మారుస్తుంది. కర్మ దాత, న్యాయ దేవుడు అని పిలువబడే శని దేవుడు కూడా జనవరి 17న తన అభిమాన రాశిలోకి ప్రవేశించాడు. శనిదేవుడు మూలికోన రాశిగా చెప్పబడే కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత 2025 ప్రారంభం వరకు ఈ రాశిలోనే ఉంటాడు. అయితే ఈ ప్రభావం అన్ని రాశులలో కనిపిస్తుంది, కానీ దాని ప్రత్యేక ప్రభావం కొన్ని ప్రత్యేకమైన రాశులలో కనిపిస్తుంది. అయితే ఆ  అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవి అదృష్ట రాశులుగా ఉంటాయని వేదాలు చెబుతున్నాయి. 


కుంభ రాశి -  శనిదేవుని ఈ రాశి మార్పు కుంభరాశిలో మాత్రమే జరిగిందని అందరికీ తెలుసు. ఈ కారణంగా ఈ రాశి వారికి కూడా, రెండున్నర సంవత్సరాలు ఒక రాజా లాంటి జీవితం ఇవ్వబడుతుంది, ఈ సమయంలో ఈ రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. దీనితో పాటు, పిల్లల వైపు నుండి శుభవార్తలు ఉండవచ్చు. వైవాహిక జీవితాన్ని గడుపుతున్న ఈ రాశి వారికి ఈ సమయం చాలా ప్రత్యేకమైనది.


మిథున రాశి -  శనిదేవుని రాశి మార్పు మిథునరాశి తొమ్మిదో స్థానంలో జరిగింది. దీనితో పాటు ఈ రాశి వారి జాతకంలో శష మహాపురుష రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు పని సమయంలో ప్రయాణించవలసి ఉంటుంది. అవివాహితులైన వారికి వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. ఈ రాజయోగం ఈ రాశి వారికి రెండున్నరేళ్లపాటు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 


వృషభ రాశి -  వృషభ రాశి వారికి శనిదేవుని సంచారం శుభప్రదం కానుందని చెబుతున్నారు. ఎందుకంటే శని దేవుడు మీ జాతకంలో పదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. అలాగే శనిదేవుడు ఈ రాశి వారికి శష్ రాజయోగాన్ని కూడా సృష్టించాడు. ఈ సమయంలో, ఈ రాశి వారు చేసే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు కెరీర్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి, ప్రమోషన్లు, జీతాలు పెరగడం వంటివి ఉంటాయి. ఇక వ్యాపార వర్గానికి చెందిన వారు అధిక లాభాలను పొందుతారని చెబుతున్నారు. 


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Jupiter Transit 2023: గురు గ్రహం గోచారం, ఏడాది పాటు ఆ 5 రాశులకు తిరుగేలేదు


Also Read: Sun transit 2023: పితృదోష యోగం ప్రభావం, ఏప్రిల్ 14 నుంచి ఈ రాశులకు నెలరోజులు నరకమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook